*అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తున్నాం.*
అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి మరీ గుర్తించి సంక్షేమ పథకాలను, ధ్రువపత్రాలనం ఇంటి ముంగిటికే అందిస్తున్నామని తాసిల్దార్ ఐపి శెట్టి, ఎంపీడీవో జాన్ లింకన్ అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి, జొన్నాడ సర్పంచులు యు లక్ష్మి మౌనిక, కట్టా శ్రీనివాసు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న 11 పథకాలకు సంబంధించి మడికి పంచాయతీ పరిధిలో 859 మందికి, జొన్నాడ పంచాయతీ పరిధిలో 425 మందికి దృపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆలమూరు వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, జొన్నాడ ఉపసర్పంచ్ నాడ్ర నాగమోహన రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలి రోజు నుంచి ప్రజలకు ఏవిధంగా సంక్షేమ పాలన అందిచాలో ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. ఆదిశలో 99 శాతం మందికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించమన్నారు. కొన్ని సాంకేతిక పరమైన అంశాలు వలన పథకాలు అందని ఒక శాతం వారిని గుర్తించి ఆ పథకాలు, ధ్రువపత్రాలు అందించే ప్రయత్నం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్నామన్నారు. జనన, మరణ, వివాహ, కుల, ఆదాయ ధ్రువీకరణ వంటి 11 రకాల ప్రభుత్వ సేవల యొక్క పత్రాలు అందజేసే బృహత్తర కార్యక్రమమే జగనన్న సురక్ష అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాల యొక్క ప్రయోజనాలను నేరుగా ఆ ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నామన్నారు. గతంలో సంక్షేమ పథకాలు అమలు కొద్ది మందికే అందేవని, పెన్షన్ కోసం ఎవరైనా చనిపోతే మాత్రమే మరొకరికి వచ్చే అవకాశం ఉండేదన్నారు. నేడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత అర్హత ప్రామాణికంగా పథకాలు అమలు చేయడం లక్ష్యం దిశగా అడుగులు వేయడం జరిగిందన్నారు. ఆక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందన్నారు. ఇటువంటి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే ఈ ప్రభుత్వానికి మీ అండ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పోసమ్మ, డిప్యూటీ తాసిల్దార్ జానకి రాఘవ, ఈవోపిఆర్డి రాజ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఏఈ శ్రీనివాసు, పంచాయతీ కార్యదర్శులు ఎం మోక్షంజలి, సిహెచ్ వీరమాత, ఎం ఆదిత్యా రెడ్డి, వీఆర్వోలు సూర్య ప్రకాష్, జ్యోతి, వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.