*డెంగ్యూ,మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు వహించాలి..*
_దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ,మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని పెద్దపళ్ల, చొప్పెల్ల పిహెచ్సి వైద్యాధికారులు పి.భవానిశంకర్,ఆర్.సుదర్శన్ బాబు,డి.మల్లికార్జున, డి.సువర్చలానాయుడు అన్నారు.వారి నేతృత్వంలో ఆరోగ్య పర్యవేక్షకులు పివి.రమణారావు, వెంకటేశ్వరరావు,వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఆలమూరు మండలంలోని పలుగ్రామంలో ఏఎన్ఎం,ఆశావర్కర్లు సహకారంతో స్థానిక ప్రజలకు,ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డెంగ్యూ,మలేరియా వంటి సీజనల్ వ్యాధులతో పాటుగా కుష్టు వ్యాధి,వ్యక్తిగత పరిశుభ్రత,ఆహార భద్రత అలవాట్లుపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా మలేరియా,డెంగ్యూ రెండూ దోమల ద్వారా వ్యాపించే వ్యాధులని,ఇవి మరే ఇతర వ్యాధి లేని విధంగా ప్రజలను భయపెడుతున్నాయన్నారు. దోమల సమూహాలు అపరిశుభ్రమైన ఇళ్లకు చేరుకుని భయాందోళనలకు గురిచేస్తాయని,ఇంటి పరిసర ప్రాంతాలలో వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మురికి నీటి నిలవలు లేకుండా చూడాలన్నారు.డెంగ్యూ మలేరియా ద్వారా సాధారణ లక్షణాలు తలనొప్పి,తీవ్రమైన కండరాల నొప్పి,నడుమునొప్పి,జ్వరం వంటి లక్షణాలు ఏర్పడతాయన్నారు. ఇప్పటికే గ్రామస్థాయిలో వాలంటీర్లు ద్వారా 50వ ఫీవర్ సర్వేను ఈనెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నారని,ఇందులో భాగంగా కరోనా నిర్ధారణను సూచించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఇచ్చి ఉన్నారని ఇతర దేశాల నుండి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాలంటీర్లకు సరైన సమాచారం అందజేస్తే కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వైద్యాన్ని అందజేస్తామన్నారు. అనంతరం కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించి రక్త పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ పీ వెంకటరత్నం,రాధాకృష్ణ,వైద్య సిబ్బంది, ఏఎన్ఎమ్,ఆశ వర్కర్లు పాల్గొన్నారు._