తీన్మార్ మల్లన్న టీం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పోకల జగదీష్ గుప్తా

తీన్మార్ మల్లన్న టీం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పోకల జగదీష్త్ గుప్త..

వికారాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా వడ్ల జగదీశ్ చారి..

నియామక పత్రం అందజేసిన తీన్మార్ మల్లన్న టీం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గణపురం శ్రీనివాస్..

కార్యక్రమం లో ముఖ్య అతిథి గా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేష్ పటేల్..

తీన్మార్ మల్లన్న టీం నూతన కార్యవర్గాన్ని టీమ్ జిల్లా అధ్యక్షుడు ఘనపురం శ్రీనివాస్ శుక్రవారం వికారాబాద్ పట్టణంలో ప్రకటించారు. టీం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పోకల సాకేత్ గుప్త , వికారాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా వడ్ల జగదీశ్ చారీలను ప్రకటిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ పటేల్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ప్రజల కోసం చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు చూసి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా అధికార పార్టీని ప్రశ్నించనటువంటి ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ప్రతి విషయంలో ప్రతిపక్ష హోదాలో అధికార పార్టీని ప్రశ్నిస్తూ నిజంగా ప్రతిపక్షంగా నిలుస్తున్న తీన్మార్ మల్లన్న ధైర్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని చూసి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, అవినీతిని బయటపెడుతూ, ప్రజల కోసం పని చేస్తుండడం చూసి మల్లన్న టీం లో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అనంతరం ఘనపురం శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో పనిచేయడానికి తీన్మార్ మల్లన్న టీం వికారాబాద్ జిల్లాలో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుందని, విద్యార్థి, ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న వికారాబాద్ కమిటీని చూసి వారి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమై తీన్మార్ మల్లన్న టీంలో చేయడం జరుగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర నాయకులు నరేష్ పటేల్, ప్రధాన కార్యదర్శి పవన్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న టీం సాకేత్ జగదీష్ లు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మాకు ఈ పదవులు ఇచ్చిన తీన్మార్ మల్లన్న అదేవిధంగా తీన్మార్ మల్లన్న రాష్ట్ర జిల్లా బాధ్యులకు ప్రతి విషయంలో సహకరిస్తూ వికారాబాద్ జిల్లాలో తీన్మార్ మల్లన్న టీం ప్రజల కోసం పని చేస్తుందని ప్రతి విషయంలో పాల్గొని ప్రజలను ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేస్తామని చెప్పారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!