*ఆప్యాయత చూపిస్తున్న జగనన్నను ఆదరించండి – ఎమ్మెల్యే భూమన*
*తిరుపతి*
*రాష్ట్రాభివృద్దికి నిరంతరం తపిస్తూ, ప్రజలపై ఆప్యాయత చూపిస్తున్న జగనన్నను ఆదరించండని కోరుతూ తిరుపతి నెహ్రూ నగర్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను అభ్యర్ధించారు. ప్రభుత్వ పథకాలు పొందిన ప్రజలను భూమన పలకరిస్తూ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీల మేరకు తాను అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకటించిన హామీలను అమలు చేస్తూ ప్రజలకి ఆసరగా నిలుస్తున్న జగనన్నకి మనమంతా తోడ్పాటుగా వుండాలన్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత వుండి కూడా ప్రజా పథకాలు అందుకోకుండ వున్న వాఐని గుర్తించేందుకు, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మరోమారు ఆదరించి రాష్ట్రాభివృద్దికి పాటుపడాలని భూమన విజ్ఞప్తి చేసారు. ఈ సంధర్భంగా మీడియాతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ శనివారం తిరుపతిలోని తమ యువజన సంఘం నాయకుడు అజయ్ కుమార్ ను తెలుగుదేశం రౌడీలు గయపర్చడాన్ని ఖండింవారు. టిడిపి నాయకుడు నారా లోకేష్ ఇటివల బహిరంగంగా వారి కార్యకర్తలకు హామి ఇస్తూ మీపై ఎన్ని కేసులుంటె అంతగా మీకు పదవిలస్తాము అని చెప్పడంతో, వారి కార్యకర్తలు ఈ విధంగా బౌతికదాడులకు పల్పడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్ కల్పనా యాదవ్, డివిజన్ నాయకులు యాదవ కృష్ణ, మైనార్టి కార్పొరేషన్ డైరెక్టర్ ఇమ్రాన్, ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ నైనార్ శ్రీనివాసులులు, గంగమ్మగుడి చైర్మెన్ కట్టా గోఫి యాదవ్, మునిసిపల్ కో ఆప్సన్ శ్రీదేవి, నాయకులు పసుపులేటి రవి, శ్రీనివాసులు, వినయ్ రాయల్, కంకనాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.