షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు
బీఆర్ఎస్ యువ నేత “నందారం అశోక్ యాదవ్” భారీ విరాళం
జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రూ.1లక్షా 10వేల విరాళం
షాద్ నగర్, : సమాజంలో ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని, దేవాలయాలు మానవ మోక్షానికి మార్గాలని అందుకే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కోసం దేవాలయాలకు సహకరించడం మానవ ధర్మమని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. చటాన్ పల్లికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు నందారం అశోక్ యాదవ్ శుక్రవారం జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం ఒక లక్ష పదివేల రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు.. అశోక్ యాదవ్ ను శాలువాతో సత్కరించగా వేద పండితులు వేద మంత్రోచ్చరనల మధ్య ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అశోక్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని, దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఔదార్యం ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, కౌన్సిలర్ రాయికల్ శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు మహేష్ మాల, హరీష్ రెడ్డి, ప్రకాష్, సంతోష్ నాయక్, బాబు తదితరులు పాల్గొన్నారు.