హైదరాబాద్:-తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతుంటే మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా కేసీఆర్తో ఉత్తమ్ దంపతులు టచ్లో ఉన్నారట. వారిద్దరికీ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.