మార్క్స్ సిద్ధాంత అవగాహనతో ప్రజలను చైతన్యులగా చేయాలి
మహానందిలో ఘనంగా సిపిఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు
-సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు
స్టూడియో 10 టీవీ న్యూస్, జూన్ 18, మహానంది:
మార్క్స్ సిద్ధాంత అవగాహనతో ప్రజలను చైతన్యులగా చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగ నాయుడు అన్నారు.ఆదివారం మహానందిలోని శాలి వాహన కల్యాణ మండపంలో మొదటిరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,రామానాయుడు,కె. రామాంజనేయులు, ప్రొఫెసర్ వెంకటరమణ హాజరయ్యారు.ఈ శిక్షణా తరగతుల విజవంతానికి సూచికగా పథాకావిష్కరణను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు ఆవిష్కరించారు.ఈ ప్రారంభ సభకు మహానంది మండల సిపిఐ కార్యదర్శి వీరప్ప అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్థితుల్లో అవలంబిస్తున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా చైతన్యవంతమైన సిద్ధాంత పరమైన అంశాల పైన ప్రతి ఒక్క కార్యకర్త అవగాహన కలిగి సమాజంలో జరిగే అసమానతలను తిప్పి కొట్టేందుకు సిద్ధాంత పరంగా ఉద్యమానికి సన్నద్ధం కావాలన్నారు. ఈ దేశంలో బానిస సమాజం నుండి పెట్టుబడి దారి సమాజం వరకు జరిగే పరిణామ క్రమాన్ని అందరూ అవగాహన చేసుకోవాలన్నారు. మతం పేరుతో దేవుడి పేరుతో ఈరోజు దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పరిపాలన కొనసాగిస్తుందన్నారు. బ్రిటిష్ పుష్కర వాదులను ఈ దేశం నుండి తరిమికొట్టేందుకు అనేక త్యాగాలకు చిహ్నమైన భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను ఈ దేశ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుగుణమ్మ, సుంకయ్య, రాధాకృష్ణ, మోట రాముడు, ప్రసాద్, భాస్కర్, నాగరాముడు, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.