తెలంగాణ ఉద్యమంలో ముందున్న వికారాబాద్ అభివృద్ధిలో ఎందుకు వెనుకబడిపోయింది బీఎస్పీ వికారాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి పెద్ది అంజయ్య

తెలంగాణ ఉద్యమంలో ముందున్న వికారాబాద్, అభివృద్ధిలో ఎందుకు వెనుకబడిపోయింది.
వికారాబాద్ జిల్లా ఎందుకు అభివృద్ధికి నోచుకోవడం లేదు, కారకులు ఎవరు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలకులు మా ప్రాంతానికి నిధులు ఇవ్వడం లేదని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ పాలకులు ఈ ప్రాంతాన్ని అణిచివేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, ఈ ప్రాంతంపై వివక్ష చూపడమే కాకుండా కుట్రలు చేయడం దేనికి సంకేతం,9 సంవత్సరాల కాల వ్యవధిలో కాలయాపనే తప్ప కార్యాచరణ లేదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని అనుకునే లోపే వికారాబాద్ ప్రజలు మారో జిల్లా ఉద్యమానికి పిడికిలి బిగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే జిల్లా ఏర్పాటును అడ్డుకోవడం జరిగింది, అప్పటి MLA స్వర్గీయ శ్రీ సంజీవ రావ్ గారి పాత్ర కీలకం, కానీ వికారాబాద్, తాండూర్, పరిగి ప్రజలు వికారాబాద్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు అలుపెరుగని పోరాటం చేసి జిల్లాను సాధించుకోవడానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది, జిల్లాను సాధించుకున్నాం కానీ అభివృద్ధిలో ముందుకు సాగలేక పోతున్నాము, ఒకప్పుడు విద్యకు నిలయమైన ఈ ప్రాంతం ఇప్పుడు విద్యలో చివరి స్థానాన్ని చేరుకున్నది, ఈ ప్రాంత వాసి అయిన సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటూ కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి, ఈ ప్రాంతం అణిచివేత కుట్రలో భాగంగానే ఈ ప్రాంతంలో కొనసాగవలసిన రెసిడెన్షియల్ పాఠశాలలు రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్నారు, అప్పుడు మహేందర్ రెడ్డి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఇద్దరి మంత్రుల కనుసన్నల్లో ఉంటూ ఈ ప్రాంతం ఎడారిగా మారే దుస్థితికి చేరుకున్నది, అభివృద్ధికి అనువు కానీ యాదాద్రిని అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి అనువుగా ఉన్న అనంత పద్మనాభ స్వామి మందిరాన్ని అనంతగిరి కొండలను అభివృద్ధి చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు, అందుకు కారణం ఈ ప్రాంతంపై ప్రేమ లేకపోవడం, చేయాలనే చిత్తశుద్ధి లేకపోవడం,పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు, డిగ్రీలు,PG,PHD చేసి ఉద్యోగాలు లేక అడ్డమీద కూలీలుగా మారుతున్నారు, ఈ ప్రాంతంలో ఒక్క రోడ్డు కూడా సక్రమంగా లేదు, గుంతల మయంగా మారిన రోడ్లలో పడి గాయాలతో ప్రయాణికులు ఎంతోమంది ఆసుపత్రుల పాలయ్యారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, అనంతగిరిలో బస్సులు కింద పడ్డప్పుడు, లారీలు కింద పడ్డప్పుడు, అప్పటికప్పుడు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి తర్వాత ఆ ప్రమాదాల గురించి పట్టించుకునే నాధుడు లేకపాయే, ఇతరుల చావులను కూడా ప్రచారాలకు వాడుకునే దిగజారుడు రాజకీయాలకు నిలువుటద్దాలుగా మారిన వికారాబాద్ పాలకులు, రైతులు పంటలు పండడం లేదని బాధపడడం కంటే, మీ పక్క గ్రామంలో జరుగుతున్నటువంటి గుట్టలను మైనింగ్ రూపంలో భూస్థాపితం చేస్తా ఉంటే వానలు పడేదెట్ట రైతులు బతికేదెట్ల, కావున వికారాబాద్ ప్రజలారా ఇది ఉద్యమ గడ్డ, ఇది మేధావులు ఉండేటటువంటి ప్రాంతం, ఇక్కడ విద్యార్థులు పిడికిలి బిగించే ప్రాంతం కావున ఈ ప్రాంత అభివృద్ధికై ఒక్కొక్కరం అడుగు ముందుకు వేయకపోతే మరో వంద సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని వెనక్కి నెట్టి మన జీవితాలలో చీకటి నింపే ఈ కుట్ర దారులను ఈ ప్రాంతం నుంచి బహిష్కరించే కార్యక్రమానికి సిద్ధమవుదాం కాళోజి గారు చెప్పిన మాటలను ఆచరణలో పెడదాం. (ప్రాంతేతరులు ద్రోహం చేస్తే ప్రాంతం దాటే వరకు తరిమికొడదాం ప్రాంతం వారే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతిపెడదాం) అనే నినాదంతో ఈ ప్రాంత అభివృద్ధికై మనమందరం సన్నతం కావలసిన సమయం ఆసన్నమైంది మరో ఉద్యమానికి సిద్ధమవుదాం.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!