ఎస్ఈబి స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం బాటిల్లు ధ్వంసం.*

*ఎస్ఈబి స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం బాటిల్లు ధ్వంసం.*

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో స్థానిక ఎస్ఈబీ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిల్లను విజయవాడ డిప్యూటీ కమిషనర్ స్పెషల్ ఇంఫోర్స్మెంట్ వారి ఉత్తర్వులు మేరకు అమలాపురం అడిషనల్ ఎస్పి,ఎస్ఈబి ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో అమలాపురం ఇంచార్జ్ ఏఈఎస్ ఎం.శ్రీనివాస్ సమక్షంలో బుధవారం అక్రమ మధ్యం బాట్లను ద్వంసం చేసినట్లు ఎస్ఈబి సీఐ అరుణమ్మ తెలియజేశారు.ఈ మేరకు వారు తెలిపిన వివరాలు ప్రకారం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యం) 512 బాటిల్స్ ను,డ్యూటీ పెయిడ్ లిక్కర్ కి సంబంధించిన 51 బాటిల్స్ ను,164 లీటర్ల సారాను మొత్తం కలిపి స్టేషన్ ఆవరణ నందు అధికారులు సమక్షంలో ధ్వంసం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యాన్ని తరలించి, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ ఎస్సై రాంబాబు,తమ సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!