*నాలుగు ఏళ్లలో బడి పిల్లల కోసం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేసిన ఒకే ఒక సీఎం జగన్ మోహన్ రెడ్డి*
-సర్పంచ్ తమ్మన శ్రీనివాస్
*కార్య క్రమంలో ముఖ్య అతిధులుగా పిఠాపురం నియోజక వర్గ పరిశీలకులు డాక్టర్ చల్లా ప్రభాకర రావు,ఎంపీపీ తోరాటి లక్ష్మణ రావు, జెడ్పిటిసి తోరాటి సీతా మహాలక్ష్మి రాంబాబు, యనమదల నాగేశ్వరరావు*
డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కొత్తపేట నియోజకవర్గం,ఆలమూరు మండలం చెముడులంక శ్రీ తిర్నతి సూర్యనారాయణ మూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జగనన్న విద్యాకానుక కిట్లను వారు సోమవారం విద్యార్థినీ, విద్యార్థులకు అందజేసే కార్యక్రమం నిర్వహించారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఐడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకూ చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ చేసి విద్యార్థులకు చదువు భారం కాకూడదు అని రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు.అనంతరం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి,జాతీయ అవార్డ్ గ్రహీత, పిఠాపురం నియోజక వర్గ పరిశీలికులు,మండల కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ చల్లా మాట్లాడుతూ చెముడులంక సర్పంచ్ గా తమ్మన శ్రీనివాస్ సేవలను కొనియాడారు,గ్రామాన్ని అభివృద్ధి పధం లో తీర్చిదిద్దడానికి ఆయన కృషి ,శాసన సభ్యులు ప్రభుత్వ విప్ జగ్గరెడ్డి సహాయ సహకారాలను అభినందించారు. పాఠశాల నీ కూడా అత్యంత సుందరంగా తీర్చదిద్దారు అని ఆయన అన్నారు . నాణ్యమైన విద్యా ,అవసరమైన ప్రతిధి ఉచితంగా అందించి చదువు భారం కాకుండా చేయడం లో విజయం సాధించిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ అని అన్నారు డాక్టర్ చల్ల.విద్యాకానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లోష్-తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లు, వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తారు. దీంతో పాటు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ , 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యాకానుక కిట్ తొలిరోజే అందచేయడం ఒక చరిత్ర అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాన్ లింకన్, ఎంఈఓ మురళి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ తోరాటి రాంబాబు, చొప్పెల్ల సర్పంచ్ దంగేటి చంద్రకళ, దొండపాటి చంటి, పంచాయతీ కార్యదర్శి యు రేణుక, సుంకర కామరాజు, ప్రధానోపాధ్యాయులు ఏడిద నాగేశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్ సుంకర శ్రీనివాసు, మోటూరి సురేష్, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.