మండలంలో పదవ తరగతి పరీక్షల్లో 45.2 శాతం ఉత్తీర్ణత -మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య
స్టూడియో 10 టీవీ న్యూస్, మే06, మహానంది:
మహానంది మండలంలోని పదవ తరగతి పరీక్షలు 11 పాఠశాలల్లోని 445 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా201 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని తిమ్మాపురం మోడల్ స్కూల్ విద్యార్థి టేకూరి రాము 558, ఎల్ శిరీష 554 మార్కులు, గోపవరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆనంద జ్యోతి 515 మార్కులు, గాజులపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి సిరివెన్నెల 559 మార్కులు, క్రీస్తు జ్యోతి పాఠశాలలో బిలాకల గూడూర్ జబి 539, షేక్ సుభాన్ 518 మార్కులు, శాంతినికేతన్ పాఠశాలలో పఠాన్ దిల్షాద్ బేగం 579 మార్కులు,సాధించారని తెలిపారు. మండలంలోని విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 45.2 వచ్చిందన్నారు. వీరితోపాటు పలువురు విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు.క్రీస్తు జ్యోతి పాఠశాల కరస్పాండెంట్ షిధిన్ శామ్యూల్ మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తమ విద్యార్థులు 81.3 శాతం మార్కులతో మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను క్రీస్తు జ్యోతి పాఠశాల ప్రిన్సిపాల్ జీనా బాబు ,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులను అభినందించారు.