గ్రామాల్లోని ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని

గ్రామాల్లోని ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని

స్టూడియో 10 టీవీ న్యూస్, మే06, మహానంది:

గ్రామాల్లోని ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని అన్నారు.శనివారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు.అనంతరం మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.అకాల వర్షాలకు,ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలకు గుర్తించి నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గ్రామాల్లో నెలకొన్న మేజర్ సమస్యలను గుర్తించి నిర్లక్ష్యం వహించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని సంబంధించిన సమస్యను పరిష్కరించే విధంగా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జనార్దన్ శెట్టి, ఎంపీడీవో శివ నాగజ్యోతి,జెడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి,వివిధ శాఖల మండల స్థాయి అధికారులు,గ్రామ సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!