*కేరెల్లి కి విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు*
వికారాబాద్ 🙂 శనివారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్”* గారు *”మీతో నేను”* కార్యక్రమంలో భాగంగా *ధారూర్* మండల పరిధిలోని *బాచారం, కొండాపూర్ కుర్దు* మరియు *కేరెల్లి* గ్రామాలలో ఉదయం *06:30 AM* నుండి *12:30 PM.* వరకు పర్యటించారు.
◆ కేరెల్లి పరిసర ప్రాంతాలకు అవసరాల రిత్యా నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను మంజూరు చేయించడం జరిగిందని, త్వరలో సబ్ స్టేషన్ కు సరిపడా స్థలాన్ని పరిశీలించి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు.
◆ గ్రామంలో ఐరన్ పోల్స్ తీసివేసి, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి, గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ కు దిమ్మె ఏర్పాటు చేయాలని, గ్రామంలో మరియు పంట పొలాల్లో వేలాడుతున్నటువంటి విద్యుత్ తీగలను సరిచేయాలని, విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు.
◆ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇండ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి సరిపడా నీటిని అందించాలన్నారు.
◆ సురక్షితమైన మిషన్ భగీరథ మంచినీటిని ప్రజలందరూ త్రాగాలని, అందుకు అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు.
◆ గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు తొలగించాలన్నారు.
◆ ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు.
◆ పశు వైద్య అధికారులు *ప్రతి సోమవారం* ఉదయం 9 గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉండి పశువులకు వైద్య సేవలు అందించాలన్నారు.
◆ కేరెల్లి గ్రామ పంచాయతీకి రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు *7 కోట్ల 34 లక్షల రూపాయలు* రైతులకు ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు.
◆ మరణించిన 15 మంది రైతు కుటుంబాలకు *రైతు బీమా పథకం ద్వారా 70 లక్షలు* రావడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.