జూనియర్ పంచాయతీ సెక్రటరీల రిలే దీక్షలకు సంజీవిభావం తెలిపిన *మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పి ఆనంద్*
1. కెసిఆర్ ప్రభుత్వం పంచాయతి సెక్రటరీలను నియమించుకునే సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
2. పంచాయతీ సెక్రటరీలు మూడు సంవత్సరాల విధి నిర్వహణ గడువు దాటిన ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక కాంట్రాక్టు ఉద్యోగాలు గాని ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరిని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అక్కడక్కడ కొన్ని వ్యవస్థల్లో మాత్రమే రెగ్యులరైజ్ చేయడం జరిగింది.
కానీ ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీలు 9000 పైసలుకు నాలుగు సంవత్సరాల క్రితం రిక్రూట్మెంట్ చేసుకొని తెలంగాణ ప్రభుత్వం మూడు సంవత్సరాల వ్యవధిలో రెగ్యులర్ చేసుకుంటామని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకున్న పంచాయతీ సెక్రటరీలను నాలుగు సంవత్సరాలు దాటిన కెసిఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లే వ్యవహరిస్తుందని విమర్శించారు.
అంతేకాకుండా బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం అని పంచాయతీ సెక్రటరీలో చేరిన అనేకమంది ఉద్యోగులు విధి నిర్వహణలో చనిపోయిన వారికి అందరి ప్రభుత్వ ఉద్యోగం లాగా రావాల్సిన బెనిఫిట్స్ అందలేక ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే వారిని పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వేతనానికి సమానంగా వేతనము రావాల్సి ఉంటుంది అన్ని రకాల అలవెన్స్లతో కూడుకున్న జీతభత్యాలు ఇవ్వాల్సింది పోయి కనీసం ఇంత క్రింది స్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఇచ్చిన మాట నిలబెట్టుకుని కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ చేసి వారికి న్యాయం చేయాల్సిందిగా మహాజన సోషలిస్టు పార్టీ వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ పి ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రం స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ముందర వికారాబాద్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రెటరీ అందరు జేఏసీగా ఏర్పడి రిలే నిరాహార దీక్షలో చేస్తున్న ప్రతి సిబ్బందికి మహాజన సోషలిస్టు పార్టీ మరియు మందకృష్ణ మాదిగ గారు అండ ఉంటారు అని మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని ఉదృతం చేసి లక్ష్యాన్ని సాధిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.