విద్యుత్ ఘాతుకానికి గురై పాడి గేదెలు, ఆవు మృతి
స్టూడియో 10 టీవీ న్యూస్, మే01, మహానంది:
విద్యుదాఘాతానికి గురై మూడు పాడి గేదెలు, ఒక ఆవు మరణించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మహానంది మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన నీరుకట్టు వెంకటరాముడి మూడు పాడి గేదెలు,ఒక ఆవుగ్రామ సమీపంలోని మహేశ్వరమ్మ పొలంలో మేతకు వెళ్లి మేస్తుండగా, గత రాత్రి వచ్చిన గాలివానకు విద్యుత్ స్తంభం విరిగిపడింది. విద్యుత్ తీగలు నేలపై పడ్డాయి. విద్యుత్ సరఫరా జరుగుతుండడం వలన విద్యుత్ తీగలను గమనించకుండా వదలేయడంతో వెంకటరాముడి కి చెందిన మూడు గేదేలు, ఒక ఆవు మేత మేస్తూ అటుగా వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.అది గమనించిన వెంకట్రాముడు వాటి సమీపానికి వెళ్ళబోగా విద్యుత్ ఘాతం జరుగుతుండడంతో నిలిచిపోయాడు. అప్పటికే విద్యుదాఘాతంతో మూగజీవాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయిన గేదెల విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని, ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారన్నాడు. పాడి సంపదే ఆదారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు వాపోతున్నాడు.