ఎమ్మెల్యే ఆనంద్ కృషితో గ్రామాల పోలీస్ స్టేషన్ పరిధి మార్పు

*ఎమ్మెల్యే గారి కృషితో గ్రామాల పోలీస్ స్టేషన్ పరిధి మార్పు*

ధారూర్ మండల పరిధిలోని *గోధుమ గూడ, జైదుపల్లి, సర్పన్ పల్లి మరియు రాళ్ల చిట్టెంపల్లి గ్రామాలను* గతంలో రెవెన్యూ పరిధి ధారూర్ మండలం నుండి వికారాబాద్ మండలానికి మార్చడం జరిగింది. కానీ పోలీస్ స్టేషన్ పరిధి మాత్రం ధారూర్ పోలీస్ స్టేషన్ లో ఉండగా…

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్”* గారు గతంలో, రాష్ట్ర హోంశాఖ మాత్యులు గౌరవ *మహమూద్ అలీ* గారిని కలిసి, ధారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను వికారాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని వినతిపత్రం ఇవ్వగా…

ప్రస్తుతము ప్రభుత్వం ఇట్టి నాలుగు గ్రామాల పోలీస్ స్టేషన్ పరిధిని *ధారూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుండి వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి* మార్చడం జరిగింది. కాబట్టి ఇక నుంచి ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఫిర్యాదుల గురించి, వివిధ పోలీస్ సేవల గురించి వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో సేవలను వినియోగించుకోగలరు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!