*ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మాలె గాయత్రి లక్ష్మణ్*
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31 వ వార్డులో *నిర్మాణ్ సంస్థ* వారి సహకారంతో కౌన్సిలర్ *మాలె గాయత్రి లక్ష్మణ్ సొంత నిధులతో* ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ *మాలె గాయత్రి లక్ష్మణ్* మాట్లాడుతూ వార్డులోని మహిళలందరూ ఈ యొక్క శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ శిబిరాన్ని 18 నుండి 40 సంవత్సరాల వయసుగల మహిళలు మాత్రమే అర్హులని అనంతరం శిక్షణ పూర్తయిన వారికి ఉపాధి కూడా కలిపిస్తామని అన్నారు..మొదటి బ్యాచ్ కు 42 మంది మహిళలు ఎన్రోల్మెంట్ చేసుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమం లో నిర్మాణ్ సంస్థ సిబ్బంది, వార్డు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.