చికిత్స పొందుతూ కోలుకోలేక వాలంటీర్ మృతి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 28, మహానంది:
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక వాలంటీర్ మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహానంది మండలం యు. బొల్లారం గ్రామానికి చెందిన వాలంటీర్ మనోహర్ (38) గత ఐదు రోజుల క్రితం తన కొడుకుకి ఆరోగ్య నిమిత్తం నంద్యాల కెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుని తిరుగు ప్రయాణంలో వస్తుండగా సుగాలి మెట్ట మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కాగా, కొడుకుకి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారి కుటుంబ సభ్యులు అక్కడి చేరుకొని నంద్యాలలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ కోలుకోలేక మృతి చెందాడు.మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.