హైందవ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అర్చకులది-వేద పండితులు రవిశంకర అవధాని
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 26, మహానంది:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అధ్వర్యంలో ఉభయ కర్నూలు జిల్లా అర్చకులకు రెండు రోజుల అర్చక శిక్షణ కార్యక్రమం మహానంది క్షేత్రంలోని పోచ బ్రహ్మానందరెడ్డి విశ్రాంతిభవనమునందు గురువారం అర్చక ట్రైనింగ్ అకాడమీ సహాయక కార్యదర్శి చక్రవర్తి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ,ఆలయ పాలక మండలి చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి,ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అర్చకులపై ఎంతో ఉందని, హిందువులు పర ధర్మం వైపు చూడకుండా సనాతన ధర్మాన్ని పాటించే విధంగా అర్చకులు కృషి చేయాలని, ఆలయానికి వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా పూజాది కార్యక్రమాలు చేయాలని, ఆలయానికి వచ్చే భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్చకులు పాల్గొన్నారు.