మహానంది క్షేత్రంలో నేడు వార్షిక పుష్కరోత్సవము
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 26, మహానంది:
మహానంది క్షేత్రంలోని (నందితీర్థంలో) పుష్కరిణిలో 27-4-2023,వ తేదన వైశాఖ శుద్ధ సప్తమి ఉత్సవం ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఉదయం 6-00 గంటల నుంచి ఘనంగా నిర్వహించబడును. ఈరోజున చేసే స్నానం వలన సంపూర్ణ పుష్కర స్నాన బలముతో పాటు గంగాదేవి తో కలిసి స్నానమాచరించిన ఫలమును,మోక్షమును పొందవచ్చును.వార్షీకంగా మహానంది క్షేత్రంలోని నందితీర్థంలో వైశాఖ శుద్ధ సప్తమి నాడు జరిగే అద్భుతం అమోఘమైనది. అటువంటి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడి క్షేత్రం తీర్థానికి చేరుకుని సంకల్ప స్నాన మాచరించి తను శుధ్ధిని పొందుతుందని స్వయంగా పురాణ,ఇతిహాసాలు చెబుతున్నాయి.
12సంవత్సరాలకు ఒకమారు వచ్చే గంగా నది పుష్కరాల స్నానమును గంగ జన్మించిన స్థలంలో చేస్తే ఎంతటి పుణ్యఫలమో, ఈ మహానంది తీర్థంలో వైశాఖ శుద్ధ సప్తమి రోజున చేసే స్నానం అంతటి పుణ్యప్రదమైనది.21-4-2023నుండి ప్రారంభమయ్యే గంగా నది పుష్కరాలు జరిగే ఈ సమయంలోనే వైశాఖ శుద్ధ సప్తమి రావడం (27-4-2023, గురువారం)అపూర్వమైన కలయిక.
మన ప్రాంతంలో మనకు కలిగిన ఇంతటి మహద్భాగ్యాన్ని అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తరించగలరు అని ఆలయ అధికారులు,అర్చకులు, వేదపండితులు,సిబ్బంది కోరారు.