*ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యకు 67 మంది విద్యార్థులు ఎంపిక..*
— ఎంఈఓ డి.మురళి సత్యనారాయణ..
_ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ప్రభుత్వం 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించింది. ఇందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల పరిధిలో మార్చి నెలలో నోటిఫికేషన్లు జారీచేసి దరఖాస్తులను ఆహ్వానించారు.ముఖ్యంగా మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు ఉచిత విద్యనందించేందుకు రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. 23 పాఠశాలలు రిజిష్టర్ చేసుకున్నాయి.ఈ మేరకు బుధవారం ఎంఈఓ డి.మురళీ సత్యనారాయణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ మొత్తం మండల పరిధిలో 140 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తులను పూర్తి చేశారని, ప్రభుత్వం ద్వారా మొదటి దాఫా లాటరీ విధానంలో 67 మంది విద్యార్థులు ఎంపికయ్యారని,వారిలో 55 మంది మాత్రమే పాఠశాలల్లో చేరారని, మిగిలిన 12 మంది వారికి నచ్చిన పాఠశాలలకు ఎంపిక కాకపోవడంతో సీట్లను తిరస్కరించారని ఆయన తెలియజేశారు._