*ప్రెస్ నోట్*
25/04/2023.
*కేసిఆర్ అంటే బ్రాండ్, ఆయన పేరు చెబితే ప్రతి పక్ష నేతల వెన్నులో వణుకు పుడుతోంది…*
*మన రాష్ట్ర అభివృద్ధి ముందు గుజరాత్ ఎందుకు పనికి రాదు…*
*నాడు నవ్విన వాళ్ళే రాష్ట్ర అభివృద్ధిని చూసి నేడు నివ్వెర పోతున్నారు…*
*-చేవేళ్ల ఎంపీ. రంజిత్ రెడ్డి.*
వికారాబాద్ :
కేసిఆర్ అంటే ఒక బ్రాండ్ అని, ఆయన పేరు చెబితే కొంత మంది ప్రతి పక్ష నాయకుల వెన్నులో వణుకు పుడుతోందనీ
చేవెళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డి అన్నారు. మంగళ వారం
వికారాబాద్ లోని ఎన్నేపల్లి
గౌలికర్ ఫంక్షన్ హాల్ లో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధ్యక్షతన వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధుల సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో జిల్లా ఇంచార్జీ, స్థానిక సంస్థల
ఎం ఎల్ సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందంటే అది ఈ గులాబీ కండువా గొప్పదనమన్నారు.
రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు తిరిగిన సందర్భంలో కేసిఆర్
రైతు ఏడ్చిన రాజ్యం బాగు పడదు అని అని అబ్ కి బార్ కిసాన్ కి సర్కార్ అనే నినాదంతో బీ ఆర్ ఎస్ పార్టీ స్థాపించారని వివరించారు.
కేంద్రం మన రాష్ట్రాన్ని అనాధ గా చూస్తుందని, ఒక్క పైసా ఇవ్వకుండా ఉద్దేర మాటలు చెప్తున్నారని బిజెపి నాయకుల పై మండి పడ్డారు. కేసిఆర్ అంటే ఒక బ్రాండ్ అని,ఆయన పేరు చెబితే కొంత మంది ప్రతి పక్ష నాయకుల వెన్నులో వణుకు పుడుతోందన్నారు.
మన రాష్ట్ర అభివృద్ధి మోడల్ చూసి మహారాష్ట్ర
ఔరంగాబాద్ లో ఉన్న 70 మంది కౌన్సిలర్ లలో
24 మంది కౌన్సిలర్ లు జాయిన్ అయ్యారని గుర్తు చేశారు. ప్రతి పల్లెలోని ప్రతి ఒకరాన్ని శస్య శ్యామలం చేశారని, ఇలాంటి మాడల్ లోనే దేశాన్ని నిర్మించ బోతున్నామని, మన రాష్ట్ర అభివృద్ధి మోడల్ ముందు గుజరాత్ మోడల్
ఎందుకు పనికి రాదన్నారు.
గత తొమ్మిది ఏళ్లలో తమ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తమకు
కేసిఆర్, కేటీఆర్ లు దిశ నిర్దేశం
చేశారని వివరించారు. నాడు నవ్విన వారే నేడు అభివృద్ధి చూసి నివ్వెర పోతున్నారన్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు సీఎం కేసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్
అద్భుతంగా ఉందని, బిజెపి నాయకులు ప్రాజెక్ట్ ను చూసి ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. బీజాపూర్ హై వే పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తాను ఎంతో కృషి చేశానని వివరించారు.
భూ సేకరణ 73 శాతం పూర్తి అయ్యిందని, త్వరలో అది అందుబాటు లోకి వస్తుందనన్నారు. మన రాష్ట్రం నుంచి కేంద్రం తీసుకునే దానికి మనకు ఇస్తున్న దానికి పొంతన లేదన్నారు. కార్యకర్తలకు తమ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
గ్రామాల్లో ఏ సమస్య ఉన్న దృష్టికి తీసుకు వస్తే తాను పరిష్కరిస్తానని, ఇది మన కుటుంబం, ఇది మన బలగం అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.