*మనందరికీ అండా గులాబీ జెండా… గులాబీ జెండా నీడలో మనకు తిరుగులేదు*
*ఫాలోవర్స్ ను కాదు లీడర్లను తయారు చేసుకుంటాం*
మంగళవారం నాడు చేవెళ్ల ఎంపీ గౌరవ *డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి* గారు, వికారాబాద్ జిల్లా BRS పార్టీ ఇంచార్జి, ఎమ్మెల్సీ గౌరవ *పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి* గారు, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* గారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని, నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన *వికారాబాద్ నియోజకవర్గస్థాయి ప్లీనరీ* సమావేశంలో పాల్గొన్నారు.
▪️ముందుగా BRS పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, జ్యోతి ప్రజ్వలనచేసి, తెలంగాణ తల్లికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు.
*గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో కచ్చితంగా హ్యాట్రిక్ సాధించి తీరుతామన్నారు.*
*దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయం BRS పార్టీ చూపించబోతుందన్నారు.*
*పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో వికారాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు రానునుందన్నారు.*
▪️ప్లీనరీ సమావేశాల్లో వ్యవసాయం, దళిత బంధు, SC సంక్షేమం, గిరిజన సంక్షేమం, BC సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికారాబాద్ అభివృద్ధి, విద్యా, ఉపాధి, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, వైద్యం, స్త్రీ సంక్షేమం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, అంశాలపై తీర్మాణాలు ప్రవేశ పెట్టి, వాటిని బలపరుస్తూ… ఆమోదించారు.
▪️తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి, 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాదిరిగానే, కేంద్ర ప్రభుత్వంకు ఏ మాత్రం దళిత వర్గాల పై ప్రేమ ఉన్నా… నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలన్నారు.
▪️ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
▪️ నిత్యవసర సరుకుల ధరలను రోజురోజుకు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు.
▪️గౌరవ కెసిఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
▪️BRS పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గౌరవ *కెసిఆర్* గారు, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మరియు ఐటీ శాఖమాత్యులు గౌరవ *కేటీఆర్* గారి ఆదేశానుసారం, వికారాబాద్ నియోజకవర్గంలో, విజయవంతంగా వికారాబాద్ నియోజకవర్గ స్థాయి *ప్లీనరీ* ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు సహకరించిన BRS పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువనాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.