*ఇరవై అడుగుల వరకు చేరుకున్న శ్రీసుబ్రహ్మణ్య స్వామి విగ్రహ నిర్మాణ పనులు ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి*
పాకాల
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపాన ఉన్న ఆనందగిరి పై వెలిసిన శ్రీవల్లి దేవసేన సుబ్రమణ్య స్వామి ఆలయం ప్రాంగణంలో యాబై నాలుగు అడుగుల శ్రీసుబ్రహ్మణ్య స్వామి విగ్రహ నిర్మాణం పనులు చేపట్టడం జరుగుచున్నవని ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఇరవై అడుగుల వరకు విగ్రహం పనులు పూర్తి చేశామని,మిగతా పనులు పూర్తి చేయడానికి దాతలు ఒక అడుగు నిర్మాణానికి యాభైఒక్క వేల రూపాయలు ఇచ్చిన దాతలు పేర్లను శిలాఫలకంపై లిఖించడం జరుగుతుందని తెలిపారు.త్వరగా దాతలు ముందుకు వచ్చి తమ విరాళాలను అందజేయాలని చెప్పారు.విగ్రహ నిర్మాణ పనులను ఒంగోలుకు చెందిన శిల్ప కళాకారులు ఇక్కడే ఉండి వారికి వసతి ఏర్పాటు చేసి విగ్రహ నిర్మాణ పనులు చేస్తున్నారని తెలిపారు.వీటితో పాటు ప్రసాదాల తయారీ భవనం ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని త్వరలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.ఆలయ ప్రాంగణంలో నిర్మించే అభివృద్ధి పనులు చెవిరెడ్డి అన్న సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నామని తెలిపారు.ఆలయంలో భక్తులు పంచమి రోజు సందర్భంగా పదమూడు అభిషేకాలు జరిపించడం విశేషం అని తెలిపారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అర్చకులు కృష్ణమూర్తి శర్మ,జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్,సిబ్బంది మణి,భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.