*ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.*
— తాసిల్దార్ ఐపి.శెట్టి..
_ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక తాసిల్దార్ ఐపి.శెట్టి అన్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు, పెద్దపళ్ల గ్రామాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన రైస్ మిల్లులను శుక్రవారం తాసిల్దార్ ఐపీ.శెట్టి అగ్రికల్చర్ అసిస్టెంట్ సోమిరెడ్డి లక్ష్మీ లావణ్యతో కలిసి పరిశీలించారు.ముందుగా మండల కేంద్రమైన ఆలమూరులో శ్రీ బాలాజీ ఆగ్రో టెక్ రైస్ మిల్లు,అలాగే గుమ్మిలేరు గ్రామంలో అనంతలక్ష్మి రైస్ మిల్లులు వద్దకు చేరుకున్నారు.ఈ సందర్భంగా వారు మిల్లర్లతో మాట్లాడుతూ మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే దింపుకొని రసీదులు మిల్లర్లలు ఇచ్చేలా చూడాలన్నారు. గోనేసంచల కొరత లేకుండా, మొబైల్ ట్యాబ్(చరవాణి)ఎంట్రీ చేయడం,తూకంలో హెచ్ తగ్గులు,జాప్యం లేకుండా చూడాలన్నారు.తేమశాతం సూచించే యంత్రాలను పరిశీలించి ధాన్యంలోని తేమశాతాన్ని సరైన రీతిలో సూచించి రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని వారు సూచించారు._