*ముగిసిన ఆలమూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు..*
— నూతన కార్యవర్గం ఏర్పాటు..
_మండల కేంద్రమైన ఆలమూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ఏర్పాటు చేశారు.జాయింట్ సెక్రెటరీ మినహా మిగతావి ఏకగ్రీవమయ్యాయి. ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రాంగణంలో బార్ అసోసియేషన్ భవనం నందు ఎన్నికల అధికారిగా ఏ.బిందు మాధవరావు వ్యవహరిస్తూ ఉండగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు పోలింగ్ జరిగింది.అనంతరం ఓట్లు లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించారు.అయితే నూతన కార్యవర్గం నిమిత్తం ఎన్నికల బరిలో అధ్యక్షులుగా ఎస్విఎస్ఎన్ మూర్తి,జొన్నపల్లి సత్యనారాయణ నామినేషన్లు దాకాలు చేయగా జొన్నపల్లి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.ఉపాధ్యక్షుడుగా సరాకుల సత్యనారాయణ, కార్యదర్శిగా మాతా మహేశ్వరరావు,కోశాధికారిగా బి.విద్యా ప్రసన్నలు పోటీ చేయగా వీరికి ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా నియమించారు. అలాగే జాయింట్ సెక్రెటరీ పదవికి ఎన్నికల బరిలో జి.రాజశేఖర్, ఏ.జోగానందరావు అను అభ్యర్థులు పోటీ చేయడంతో ఎన్నికలు ఏర్పాటు చేశారు.ఈ ఎన్నికలలో 50 మంది ఓటు హక్కుదారులు ఉండగా 38 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఎలక్షన్ అధికారి సమక్షంలో అభ్యర్థుల ఓట్లను లెక్కించగా ఏ.జోగానందరావుకి 11 ఓట్లు,జి.రాజశేఖర్ కి 27 ఓట్లు రావడంతో జి.రాజశేఖర్ జాయింట్ సెక్రెటరీ పదవిని కైవసం చేసుకున్నారని ఎన్నికల అధికారి తెలియజేశారు._