నీళ్లు, నిధులు, నియామకాలకోసం ఉద్యమిద్దాం..
రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేద్దాం..రాయలసీమ స్టీరింగ్ కమిటీ ..
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 21, మహానంది:
నీళ్లు, నిధులు, నియమాలకోసం ఉద్యమిద్దామని, రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో, రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాయలసీమ కర్తవ్యదీక్ష విజయవంతం చేద్దామని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నంద్యాల జిల్లా నాయకులు యం. వి. రమణారెడ్డి, చింతకుంట ప్రతాప్ రెడ్డి లు కోరారు.శుక్రవారం మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రైతుల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాయలసీమను కరువు కోరల్లోకి నెట్టే అక్రమ ఎగువ భద్ర ప్రాజెక్టును ఆపాలని, రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు సమానంగా కేటాయించాలని, ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిన 167 K జాతీయ రహదారి నిర్మాణం లో భాగంగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై తీగల వంతెన మంజూరు అయిందని, ఈ తీగల వంతెన వల్ల రాయలసీమ కరువు, వలసలు ఆగవని, తీగల వంతెన బదులు బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మాణం చేస్తే సంగమేశ్వరం వద్ద సుమారు 70 TMC ల నీరు నిలిచి రాయలసీమ ప్రాజెక్టులకు అంది కరువు, వలసలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 24-04-2023 రాయలసీమ కర్తవ్య దీక్ష కర్నూలు STBC కళాశాల మైదానంలో జరిగిందని ఈ దీక్షకు తిమ్మాపు రం గ్రామం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దామన్నారు.ఈ సమావేశంలో చాకని గోపాల్ రెడ్డి, బి. వెంకటరమణ, జి. నరసింహులు, కె. నరప్ప, బోయ పెద్ద బాలయ్య తదితరులు పాల్గొని కరపత్రాలు ఇంటింటికి పంపిణి చేశారు.