కృష్ణా నదిపై తీగల వంతెనకు బదులు బ్యారేజీ కం బ్రిడ్జి నిర్మించాలి..
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 21, మహానంది:
కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద బ్యారేజీ కం బ్రిడ్జి తీగల వంతెనకు బదులు నిర్మాణం చేపట్టాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నంద్యాల జిల్లా నాయకులు రమణారెడ్డి , చింతకుంట ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో శుక్రవారం రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ . కేంద్ర ప్రభుత్వం 167 కె రహదారి నిర్మాణంలో భాగంగా తీగల వంతెన ప్రతిపాదన బదులుగా. సంగమేశ్వరం వద్ద బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మిస్తే అక్కడ దాదాపు 70 టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది అన్నారు. దీనివల్ల రాయలసీమకు త్రాగు మరియు సాగునీటికి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే రాయలసీమ అన్ని విధాల వెనుకబడిందని . ఎగువ భద్ర పై నిర్మిస్తున్న నిర్మాణాలు ఆపాలని రాయలసీమ కు సమానంగా నీళ్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈనెల 24న రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులోని ఎస్టీ బీసీ మైదానంలో జరిగే బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులను కోరారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమం మరింత ముందుకు సాగే విధంగాను పాలకులకు కనువిప్పు కలిగేలా రైతులు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తిమ్మాపురం గ్రామానికి చెందిన వారు పాల్గొన్నారు.