ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రమేష్ ఎంబిబిఎస్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 21, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ రమేష్ ఎంబిబిఎస్ శుక్రవారం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్. మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం అంతా నియమనిష్ఠలతో, కఠోరమైన ఉపవాసాలతో, దైవ ప్రార్థనలతో గడపి, రంజాన్ మాసంలో పేద వారికి సాయం చేస్తూ రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం కుటుంబాలకు అల్లా ఆశీస్సులు ఉండాలని అల్లా చూపిన శాంతి, సహనం, ప్రేమ, తోటి వారికి సాయం చేసే మార్గంలో నడుచుకోవాలని కోరారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన, ప్రార్ధనలు, ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలు పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలని లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ ఉన్న దానిలో ఎంతోకొంత దాన ధర్మాలు చేస్తారని, సేవా దృక్పదానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, మానవాళికి సకల శుభాలు కలగాలని, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలియికే రంజాన్ మాసం విశిష్టత అని అన్నారు. ముస్లిం సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారని ఆయన పేర్కొన్నారు.