ఈద్గా మైదానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూమన
రంజాన్ ప్రార్ధనలకు సిద్దం చేయండి : మేయర్ శిరీషా
తిరుపతి
తిరుపతి నగరంలో రానున్న రంజాన్ సంధర్భంగా తిరుపతి శ్యాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఎస్వీ యూనివర్శిటి రహదారిలో వున్న ముస్లీంల ప్రార్ధనా స్థలం ఈద్గా మైదానాన్ని సందర్శించి ముస్లిం నాయకులతో సౌకర్యాలపై చర్చించారు. మైదానంలో వేసవికాలం కావున గతం కంటే ఎక్కువగా పందిళ్లు వేయించి కూలరులు, ఫ్యాన్లు, మంచి నీరు ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష ముస్లిం పెద్దలతో మాట్లాడుతూ తిరుపతి కార్పొరేషన్ తరుపున రంజాన్ రోజు ప్రార్ధనల కోసం వచ్చేవారికి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని హామి ఇచ్చారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, స్టాండింగ్ కమిటి సభ్యులు యస్.కె. బాబులు మాట్లాడుతూ గతంలో కంటే ముస్లింల ప్రార్థనలు చేసుకునే మైదానంలో ఎక్కడ రాజీ పడకుండా ఏర్పాట్లు చేయిస్తున్న ఎమ్మెల్యే భూమనకు ముస్లిం సోదరులు తరుపున హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్నతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు డొద్దారెడ్డి సిద్ధారెడ్డి, కార్పొరేటర్ కొటూరు ఆంజనేయులు, కో ఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇమ్రాన్, తిరుపతి ఖాజీ సయ్యద్ షఫీ మహమ్మద్ ఖాద్రి, నాయకులు మాలిక్, ఇస్మాయిల్, చాంద్ బాషా, గఫుర్ మునిసిపల్ డిఈ రవీంద్ర రెడ్డి, శానిటరి సూపర్ వైజర్ చెంచయ్య పాల్గొన్నారు.*