*అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివరించిన అగ్నిమాపక సిబ్బంది*
తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ అగ్ని మాపక వారోత్సవములు సందర్భముగ ఐదొవ రోజు ఏప్రిల్ 18వ తేది మంగళవారం తిరుపతి నగరంలోని మహతి రోడ్డు వద్ద గల ఎమ్.ఎస్. ఆటో కేర్ సెంటర్ ఫిల్లింగ్ స్టేషన్, కపిల తీర్థం రోడ్డులోని కె.ఆర్. ఫిల్లింగ్ స్టేషన్, తిరుమల బై పాస్ రోడ్డులోని విష్ణు పద్మావతి ఏజెన్సీ వారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లలో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకొనవలయునో అదేవిధంగా అగ్నిప్రమాదములు జరగకుండ ఎటువంటి జాగ్రత్తలు తీసుకొనవలనో అనే అంశాల మీద అక్కడ పనిచెయు సిబ్బందికి అవగాహనా కల్పించి, డెమో నిర్వహించడం జరిగింది. తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రములు పంపిణీ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో తిరుపతి సహాయ జిల్లా అగ్నిమాపక
అధికారి నర్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.