*తిరుపతి అభివృద్ది పనులను పరిశీలించిన కమిషనర్ హరిత ఐఏఎస్*
*తిరుపతి*
*తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులను మంగళవారం ఉదయం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ దామలచెరువు హరిత ఐఏఎస్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేసారు. మొదట వార్డు పర్యటనలో భాగంగ కస్తూరిభాయ్ సంధు, అండర్ రైల్వే బ్రిడ్జ్, కర్నాలవీధి, బేరివీధి ప్రాంతాల్లో పర్యటిస్తూ శానిటేషన్ పై తగు శూచనలు జారీ చేసారు. కాలువలను పరిశీలిస్తూ మురుగునీరు సాఫిగా వెల్లెందుకు కాలువల్లో సీల్ట్ తొలగించే ప్రకియ చేపట్టాలన్నారు. సచివాలయ సిబ్బంది శానిటేషన్ పై నిరంతరం అప్రమత్తంగా వుండాలని, ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు. శ్రీనివాససేతు మూడవదశ జరుగుతున్న పనులను పరిశీలిస్తూ తిరుచానూరు మండి వద్ద నుండి ప్లైఓవర్ పై ప్రయాణించి రామానుజు సర్కిల్ మీదుగా రేణిగుంట వైపు శ్రీనివాససేతుపై జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు జారీ చేసారు. అదేవిధంగా ప్రకాశంరోడ్డు నుండి కోర్టుకు వెల్లె రోడ్డును వెడల్పు చేస్తున్న పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలన్నారు. టౌన్ క్లబ్, మ్యూజిక్ కళశాల వద్ద నిర్మిస్తున్న ప్రీ లెప్టుల పనులను చూసి త్వరగా పూర్తి చేయాలన్నారు. భాలాజీకాలనీ పూలె సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సర్కిల్ వద్ద ఫౌంటెన్ ఏర్పాటును చేయాలన్నారు. మహిళా యూనివర్సిటీ నుండి సీతమ్మనగర్ వైపు వెలుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డును పరిశీలించి త్వరితగతిన పనులను పూర్తి చేసేందుకు చూడాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు గొల్లవానిగుంట, హిరోహోండా షోరూము పరిసరాలను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంధ్రశేఖర్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రహ్మణ్యం, షణ్ముగం, డిఈలు దేవిక, మహేష్, శానిటరి సూపర్ వైజర్ చెంచెయ్య పాలొన్నారు.*