మహానంది ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన జి .నాగేంద్ర ప్రసాద్

మహానంది ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన జి .నాగేంద్ర ప్రసాద్

స్టూడియో 10 టీవీ న్యూస్ ఏప్రిల్ 19, మహానంది:

మహానంది మండల నూతన ఎస్సైగా జి .నాగేంద్ర ప్రసాద్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.గతంలో మహానంది ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్సై నాగార్జున రెడ్డి ని వి.అర్ కు బదిలీ చేయడంతో ఆయన స్థానంలో పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మహానంది ఎస్సైగా జి .నాగేంద్ర ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు.ఈయన గతంలో కర్నూలు జిల్లా మద్దికేరి మండలములో విధులు నిర్వహిస్తు మహానందికి బదిలీ అయ్యారు. ముందుగా ఎస్సై నాగేంద్ర ప్రసాద్ మహానంది పుణ్యక్షేత్రంలోని వెలిసిన శ్రీ కామేశ్వరి దహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సై నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మండలంలోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!