ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
స్టూడియో 10 టీవీ న్యూస్ ఏప్రిల్ 15,మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు క్రీస్తుజ్యోతి పాఠశాలలో శనివారం ఆరవ రోజు సాంఘికశాస్త్రం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిసాయి.గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 166 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 164 మంది విద్యార్థులు హాజరయ్యారని, క్రీస్తుజ్యోతి పాఠశాలలో 154మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 147 మంది హాజరయ్యారని సిట్టింగ్ స్క్వాడ్. కస్టోడియన్, చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.ఆఖరి పరీక్ష కావడంతో దూరప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉదయం 8 గంటలకు విద్యార్థులంతా పరీక్షా కేంద్రాల్లోకి చేరుకున్నారు.పరీక్షలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ముగిశాయి. పాఠశాలలలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులంతా పరీక్ష ముగియగానే ఇళ్లకు హుషారుగా తరలివెళ్లారు.పాఠశాలలలోని కేంద్రాల వద్ద ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిసాయి.క్రీస్తు జ్యోతి పాఠశాల కరస్పాండెంట్ షిధిన్ శామ్యూల్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిసాయని, విద్యార్థినీ,విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. మొదటిసారి పాఠశాలకు పదో తరగతి పరీక్షలు రాయడానికి సెంటర్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.