* ప్రభుత్వ అధికారులు చెప్పిన ఆగని భూ కబ్జాదారులు
దళితుల భూమి కబ్జా చేస్తున్నారని బాధితులు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం*
తిరుపతి
తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం నారాయణ వరం మండలం, అరణ్యం కండ్రిగ పంచాయతీ లోని చిత్తూరు కండ్రిగ మాదిగ వాడ మా గ్రామం పక్కన ఉండే ప్రభుత్వ పోరంబోకు భూమి సర్వే నెంబర్ 191/1,19/2,191/3,191/4,191/5,191/6,191/7 మొదలగు సర్వే నంబర్స్ గల ఆ భూమి ని పెత్తం దారులు దళితులని బెదిరించి కబ్జా కి పాల్పడుతున్నారు అని మన తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం నిర్వహించారు , అయినా మేము ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారు మా సమస్య ని స్పందన లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది,ఇదే విషయం పైన మా నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు MLA గారిని కలిసాము, MLA గారు కూడా మాకు న్యాయం చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.ఈ విషయం పైన మండలం రెవిన్యూ అధికారి MRO గారు మరియు VRO గారు, మరియు సర్వేయర్ గారు ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ సర్వే చేసారు,సర్వే చేసి ఆ ల్యాండ్ ను ఆక్రమణ చేసిన వ్యక్తులకు ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళకండి అని MRO గారు హెచ్చరించారు, అయినప్పటికీ ఆక్రమణ దారులు యాదాస్వేచ్ఛగా మళ్ళీ దుక్కి దున్నడం జరుగుతుంది, కనుక ఈ విహాయాన్ని జిల్లా కలెక్టర్ గారికి మరియు నియోజకవర్గం MLA గారికి మరియు మండల రెవిన్యూ MRO అధికారులకు, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వానికి నమస్కరించి మా దళితుల సమస్య తెలియపరచుకుంటున్నాము. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న పేదలకు భూ పంపిణీ కార్యక్రమం లో మాకు ఆ భూమి పంపిణీ చేయవలసినదిగా చిత్తూరు కండ్రిగ మాదిగ వాడ ప్రజలు నమస్కరించి కోరి ప్రార్థిస్తున్నామ ఇట్ల చిత్తూరు కండ్రిగ మాదిగ వాడ గ్రామస్తులు