రైతు చెంతకే భూసార పరీక్ష ఫలితాలు-మండల వ్యవసాయ శాఖ అధికారి బి.నాగేశ్వర్ రెడ్డి

రైతు చెంతకే భూసార పరీక్ష ఫలితాలు-మండల వ్యవసాయ శాఖ అధికారి బి.నాగేశ్వర్ రెడ్డి

మట్టి నమూనాల సేకరణ పై శిక్షణా కార్యక్రమం

స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 15, మహానంది:

రైతు చెంతకే భూసార పరీక్ష ఫలితాలు అందుబాటులోకి తెస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి బి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు.శనివారం
మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో, మండలంలోని రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి నేల ఆరోగ్యము మరియు మట్టి నమూనాల సేకరణ విధానము గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి కె.వి.ఆర్ మహేశ్వర రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ద్వారా మట్టి నమూనాల సేకరణ చేయించుకోవాలని,భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వాడుట ద్వారా సాగు ఖర్చును తగ్గించుకోవచ్చని, అదేవిధంగా భూసారాన్ని పెంచుకోవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా రబీలో పంట నమోదు చేయించుకున్న రైతుల పంట నమోదు ధ్రువీకరణ పత్రాలను రైతులకు అందజేశారు. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను గ్రూప్ కు కాకుండా విడిగా అందజేయాలని, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింకు మరియు జిప్సంలను సబ్సిడీకి అందజేయాలని తెలిపారు.మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ భూసార పరీక్షల ద్వారా నేలలో స్థూల, ద్వితీయ మరియు సూక్ష్మ పుస్తకాల స్థాయిని తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఐదు ఎకరములకు ఒక మట్టి నమూనాను సేకరించాలని ఒకవేళ చౌడు భూమి అయినట్లయితే దానికిగాను ప్రత్యేకంగా మట్టి నమూనాలు సేకరించాలని రైతు భరోసాకేంద్ర సిబ్బందికి తెలియజేశారు. పొలంలో మట్టి నమూనా సేకరించే పద్ధతి గురించి రైతు భరోసా కేంద్ర సిబ్బందికి ప్రయోగపూర్వకముగా చేపించడం జరిగినది. మట్టి నమూనా సేకరించినప్పుడు వేయబోయే పంట ఆధారంగా వీ ఆకారంలో గుంతను పంటను బట్టి సరియైన లోతులో తవ్వాలని చెప్పడం జరిగినది. పండ్ల తోటలకు సంబంధించి మట్టి నమూనాలను సేకరించినప్పుడు పంటను బట్టి మూడు అడుగుల నుండి ఆరు అడుగుల వరకు గుంత తవ్వి ప్రతి అడుగుకు మట్టి నమూనాను సేకరించాలని చెప్పడం జరిగినది. ప్రతి గ్రామంలో మట్టి నమూనాలు సేకరిస్తారని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడుట ద్వారా సాగు ఖర్చును మరియు నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కేవీఆర్ .మహేశ్వర రెడ్డి,మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర రెడ్డి, డి ఆర్ సి నంద్యాల వ్యవసాయ అధికారి ప్రభావతమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణమ్మ ,ఆయా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!