ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామసభ
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 14, మహానంది:
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామసభ నిర్వహిస్తున్నామని వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి తెలిపారు.శుక్రవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రామ సభను సచివాలయం 1 వద్ద సర్పంచ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ముందుగా 132 వ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామ సచివాలయంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ చౌటుపల్లి నరసింహులు,పంచాయతీ కార్యదర్శి మమ్మద్ ఇర్ఫాన్,పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభలో పలు ప్రజా సమస్యల గురించి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, సచివాలయ సిబ్బంది,ఆశా వర్కర్లు,వార్డు సభ్యులు,వాలంటీర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.