*తిరుపతి నగరపాలకలో బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు*
*తిరుపతి*
*ప్రజలందరికి సమాన హక్కులు కల్పించే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను ఆచరిద్దామని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి సంధర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి టెంకాయలు కొట్టి, స్వీట్లు పంచుకొని నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా మేయర్ శిరీష, కమిషనర్ హరిత మాట్లాడుతూ దేశంలోని ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు సమాన హక్కులతో జీవించేలా గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనియుడు అంబేద్కర్ జీవితాన్ని మనమంతా అనుసరించాలన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాదనలో మనమంతా భాగస్వామ్యలు అవుదామని మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవిన్యూ అధికారి కె.ఎల్.వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, స్మార్ట్ సిటీ జి.ఎం చంద్రమౌళీ, సెక్రటరీ రాధిక, మేనేజర్ చిట్టిబాబు, డిఈ విజయకుమార్ రెడ్డి, సూపర్డెంట్ పి.రవి, శానిటరి సూపర్ వైజర్ చెంచెయ్య తదితరులు పాల్గొన్నారు.