స్టూడియో10 టీవీ న్యూస్ , ఎప్రిల్ 10
తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు గుడివాడ పట్టణంలోని ఏలూరు రోడ్ దగ్గర గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టిడిపి మాజీ శాసనసభ్యులు, టిడిపి ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి పేద ప్రజల మీద విద్యుత్ బకాయిలు 57 వేల కోట్లు భారం పడిందని అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు ఒక రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని అన్నారు. చంద్రబాబు హయాంలో 9000 యూనిట్లని 13000 యూనిట్లకు పెంచగా ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న విద్యుత్ని దుర్వినియోగం చేస్తూ పేద ప్రజలపై మరింత భారాన్ని మోపిందని ఈ ప్రభుత్వం దుర్మార్గపు పాలన నశించాలని రావి అన్నారు. విద్యుత్ భారం రైతులపై మరియు ఆక్వా రంగంపై పడటమే కాకుండా పేద ప్రజల నడ్డి విరిచే విధంగా ఉందని అన్నారు. అనేక రంగాల్లో పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వచ్చాయంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వ పాలనయనే ఇందుకు కారణం అని అన్నారు. ఇదే ప్రభుత్వం మరలా కొనసాగితే పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. చేతగాని పరిపాలన చేతకాని ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన పాలన్నీ సాగనంపాలని అన్నారు. రైతు పండించే పంటకు కనీసపు ధర లేక కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలోని జరుగుతుందని అన్నారు. రైతే దేశానికి వెన్నెముక అలాంటి రైతునే కన్నీరు పెట్టించే ఈ ప్రభుత్వం అంతమొందించాలని ప్రజలు ఇకనైనా సరైన గుణపాఠం చెప్పి జగన్ పాలనని అంతమందించాలని ప్రజలను రావి కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు జంధ్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వసే మురళి, మాజీ కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు. సొంటి రామకృష్ణ, అడుసుమిల్లి శీను,టిడిపి పట్టణ యువత అధ్యక్షుడు నేరుసు కాశి, పోలాసి ఉమామహేశ్వరరావు, మైనార్టీ నాయకులు షేక్ ముజావుద్దీన్, జానీ, ఎమ్మార్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్, అయినపుడు సురేష్, కమల్, టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు డేవిడ్, నాగేశ్వరరావు, టిడిపి మహిళా నాయకురాలు సుజాత, పట్టణ టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు ముందుచూపుతో వ్యవహరించడం జరిగింది.