మహానంది దేవస్థానంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై ఆరా
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 11, మహానంది:
మహానంది దేవస్థానంలో పనిచేసే ఒక ఉద్యోగిపై ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆలయంలో ఆరా తీశారు. కానీ ఆ ఉద్యోగి కనిపించలేదు… కనిపిస్తూ దాటుకున్నాడా..అనేది తెలియాల్సి ఉంది. అందరి ఉద్యోగులపై ఏజెన్సీ మరియు అవుట్సోర్సింగ్ పర్మినెంట్ ఉద్యోగులు కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు. ఎందుకు రాలేదు. వచ్చిన ఏ సమయానికి వస్తున్నారు. ఎందుకు ఆలస్యమైంది. అందుకు కారణాలేమిటి. అని పలు ప్రశ్నలు లేవనెత్తే అధికారి ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై అంత ప్రేమ ఎందుకని పలువు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో పనిచేసే ఎవరైనా ఉద్యోగులు సంబంధిత అధికారులు పిలిచినప్పుడు రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరు కనిపించకుండా దోబూచులు ఆడడం వివాదాస్పదంగా మారింది. స్థానిక సిబ్బంది కూడా ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అనేది ఆ అధికారికి చెప్పడానికి జంకుతున్నట్లు తెలుస్తుంది. ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉదయం 10 గంటల తర్వాత ఆలయ ప్రవేశం అనంతరం 12 గంటలు దాటితే మాయ మవడం తిరిగి మరుసటి రోజు 10 గంటల తర్వాత వచ్చి రికార్డుల్లో సంతకం పెట్టడం పరిపాటిగా మారిందని ఇది అందరి ఉద్యోగులకు వర్తిస్తుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారి పిలిచినా … తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి… అనే విధంగా వ్యవహరిస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడానికి జంకుతున్నట్లు తెలుస్తుంది.. కారణం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ఇది ఏమిటని అంటూనే ఇది అందరికీ వర్తిస్తుందా… లేదా.. ఆ ఒక్క ఔట్సోర్సింగ్ ఉద్యోగికే పరిమితమ అనేది తెలియాల్సి ఉంది. సాధారణంగా ఐదు నిమిషాలు ఆలస్యం కాకుండా కెమెరా ముందు ఉంచి తమ ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించేవారు… ఉద్యోగం వదిలేసి… కేవలం రెండు గంటలు మాత్రమే విధులకు హాజరయ్యే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని పలువురు ఎదురుచూస్తున్నారు.