ప్రజల నుండి వచ్చిన నినాదమే మా నమ్మకం జగన్నన్న
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్10 మహానంది:
వైసీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు లబ్ది పొందిన లబ్ధిదారులు నుండి వచ్చిన నినాదమే జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న అని వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి అన్నారు.మహానంది మండల పరిధిలోని గాజులపల్లె గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి వివరించారు.వలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, నాయకులతో కలిసి ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదంతో ప్రతి ఇంటికెళ్లి బుక్లెట్ అందించి, స్టిక్కర్ అంటించి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు.గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కొండా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన పై ప్రజల్లో అపారమైన విశ్వాసం వ్యక్తమైందని,గతంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమ ఫలాలు అర్హుల చెంతకే చేరాయని సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగనన్నను, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు.గత ప్రభుత్వం కంటే భిన్నంగా వైసిపి పాలనలో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తున్నాయని అన్నారు.రానున్న ఎన్నికల్లో జగనన్నను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు,గృహ సారధులు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.