మోమిన్ పేట మండలం, చీమలదరి గ్రామ పంచాయతీకి 2021-22 సంవత్సరమునకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపికైనందున జిల్లా కలెక్టర్ గ్రామ అధికారులు, ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో వికారాబాద్ శాసన సభ్యులు డా. మెతుకు ఆనంద్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మలతో కలిసి గ్రామ సర్పంచ్ నాసన్ పల్లి నరసింహారెడ్డి గ్రామ కార్యదర్శి తంగడపల్లి సుగుణకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. మునుముందు కూడా అధికారులు ఇంకా పూర్తి బాధ్యతతో కష్టపడి పనిచేసి జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులైన డి ఆర్ డి ఓ కృష్ణన్, డిపిఓ తరుణ్ కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారులు అనిత, శంకర్ నాయక్
మోమిన్ పేట ఎంపీడీవో శైలజ, గ్రామ ప్రజా ప్రతినిధులను కలెక్టర్ సన్మానించారు.