*ఆలమూరులో రైతు బజార్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల.*
— వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులు నుండి సుమారు 20 లక్షల రూపాయలు మంజూరి…
_మధ్యవర్తులకు తావు లేకుండా నేరుగా సన్నకారు రైతులు సరసమైన ధరలకు కూరగాయలను విక్రయించేందుకే రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క సుమారు 20 లక్షల రూపాయల నిధులతో మండల స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు బజార్ ను గ్రామ సర్పంచ్ నాతి లావణ్య కుమార్ రాజా,మండల వైసిపి నాయకులు ఆధ్వర్యంలో సోమవారం మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షులు,స్థానిక శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి నేరుగా కూరగాయలు విక్రయించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, వినియోగదారుల మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపడానికే ఈ రైతు బజార్ ను ఏర్పాటు చేయడం జరిగిందని,అర్హత కలిగి కూరగాయల పంటలు పండించుకుని కమిషన్లు లేకుండా విక్రయించుకునే రైతులకు రైతు బజార్ మంచి వ్యాపార కేంద్రంగా మారనుందని, కొనుగోలు దారులకు కూడా రైతులు పండించి విక్రయించే తాజా కూరగాయలు సరసమైన ధరలకు లభిస్తాయిఅని అలాగే ఎస్టేట్ అధికారి నియమించిన ధరల వివరముల సూచిక పట్టిక బోర్డులను ఏర్పాటు చేస్తారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్,చెముడులంక గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్,మాజీ ఏఎంసి చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు,పిఎసిసి అధ్యక్షులు నెక్కంటి వెంకటరాయుడు బుజ్జి, వైసిపి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రావాడ సత్తిబాబు, ఉప సర్పంచ్ చల్లా సీతామహాలక్ష్మి భూషణం,ఎంపీటీసీ సభ్యులు ఉండమట్ల విజయ కుమారి, వాసం శెట్టి దుర్గాభవాని,గంగుల నాగజ్యోతి, ప్రముఖ న్యాయవాది ఎస్కే షరీఫ్,అధికారులు తాసిల్దార్ ఐపి.శెట్టి, ఆర్టికల్చర్ అధికారి అనూష, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జీ.వి.వి.ఎస్ శెట్టి, ఇంచార్జ్ ఎస్టేట్ అధికారి జి. సుబ్బారావు,వైసిపి నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.._