*వారపు సంత రైతులకు ఊరట కలిగించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి*
పాకాల వారపు సంతలో ఉచిత భోజనంను పంపిణీ
ఇప్పటికే పంచాయతీల నుంచి మార్కెట్ వేలం పాడుకున్న వాళ్లతో చర్చించి ఆ డబ్బులు స్వయంగా చెల్లించనున్న
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం
పాకాల బస్టాండ్ వద్ద మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ
వారపు సంతలో కాయ గూరలు కోనుగోలు చేసేందుకు వచ్చిన కొనుగోలు దారులకు సైతం భోజనం పంపిణీ చేస్తామని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిరంతరాయంగా భోజనం పంపిణీ జరుగుతుందని 2000 మందికి తక్కువ లేకుండా భోజనం అందిస్తామని ఇకపై నిరంతరాయంగా వారపు సంతల్లో భోజనాలు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని
వారపు సంతల్లో ఇకపై నిరంతరాయంగా భోజనం పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పష్టం చేశారు దినసరి మార్కెట్లు, వారపు సంతల్లో కాయగూరలు, పూలు, పండ్లు ఇతరత్రా వస్తువంల అమ్మకాలకు ఉచితంగా అమ్మవచ్చని పంచాయతీల ద్వారా వసూలు చేస్తున్న గేటు రుసుము చెల్లింపుల పూర్తి ఉచితం చేస్తున్నానని వాటితో పాటు ఆటో స్టాండు, బస్టాండ్, తోపుడు బండ్లు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల్ కు సైతం ఉచితం.ఇప్పటికే పంచాయతీల నుంచి మార్కెట్ వేలం పాడుకున్న గుత్తేదార్లతో చర్చించి ఆ డబ్బులు స్వయంగా చెల్లిస్తామని చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామలచెరువు, పాకాల, చంద్రగిరి, నెత్తకుప్పం, చిన్నగొట్టిగల్లు, భాకరాపేట, ఎర్రావారిపాళెం, నెరబైలు, యల్లమంద, బోడేవాండ్లపల్లి వారపు సంతల్లో రైతుల నుంచి మే 1వ తేదీ నుంచి ఏలాంటి గేటు వసూలు చేయరాదని పంచాయతీ కార్యదర్శులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆదేశాలు.వారపు సంతల వేలం ద్వారా పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని సమకూర్చే బాధ్యతను తీసుకున్న నని పాకాల వారపు సంతలో నేటి నుంచే ఉచిత అమ్మకాలకు అనుమతి ఇచ్చామని ఆ విషయాన్ని వారపు సంతలో పర్యటించి ప్రతి రైతు తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు