గాజులపల్లె మెట్టలో పడకేసిన పరిశుద్ధం
డ్రైనేజీ నిండి ఇళ్లల్లోకి చేరుతున్న మురుగునీరు
నీటి కుంటను తలపిస్తున్న డ్రైనేజీ కాలువ
దుర్గంధం వెదజల్లుతు రోగాల భారీ పడుతున్న స్థానికులు
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి28, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని మెట్ట మీద ఎటు చూసినా మురుగుతో నిండిన డ్రెయినేజీ కాలువ,దోమలకు ఆవాసంగా మారిన పరిసరాలు.ఇది దుస్థితి. పారిశుధ్యంపై పర్యవేక్షించి మెరుగుపరచాల్సిన అధికారుల జాడలేదు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. మహానంది మండలం గాజులపల్లె మెట్ట మీద డ్రైనేజీ గురించి పట్టించుకునే నాధుడే కనిపించడం లేదని, పారిశుధ్యం లోపించి, దోమలు వృద్ధిచెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ కాలువలు నుండి మురుగునీరు ఇండ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని, గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్న జిల్లా యంత్రాంగం మాత్రం ఆ దిశగా దృష్టి సారించడం లేదు అని చర్చించుకుంటున్నారు.
మెట్ట మీద మురుగునీరు నిలబడి పోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.