పంటల మద్దతు ధరలకై ఏప్రిల్ 5వ తేదీ జరిగే చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి –
ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి. రామచంద్రుడు
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 28, మహానంది:
పంటల మద్దతు ధరలకై ఏప్రిల్ 5వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి అని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు అన్నారు.మహానంది మండలంలోని గాజులపల్లె గ్రామంలోని వీధుల్లో కరపత్రాలు పంచుతూ మంగళవారం ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల 5వ తేదీన అఖిల భారత కిసాన్ సభ సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘంల ఆధ్వర్యంలో రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర చెల్లించే విధంగా పార్లమెంటులో చట్టం చేయాలని, 2022 విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని, మోటార్ల వద్ద మీటర్లు పెట్టే పథకం రద్దుచేసి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకాన్ని పటిష్టవంతంగా అమలు చేసి పనులు కల్పించాలని, కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా బహిరంగ సభ మహా ప్రదర్శనను జిల్లాలోని రైతులు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ, కోటకొండ భాష, సిపిఐ నాయకులు మద్దిలేటి, సుబ్బరాయుడు, నాయక్ తదితరులు పాల్గొన్నారు.