ఎన్ ఎమ్ ఎమ్ ఎస్ ఫలితాలలో జిల్లాలో మొదటి స్థానం సాధించిన ఆదర్శ పాఠశాల
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 25, మహానంది:
మహానంది మండలంలోని తిమ్మాపురం ఆదర్శ పాఠశాల నుంచి ఏకంగా 11 మంది విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని పాఠశాల ప్రిన్సిపాల్ కె. లక్ష్మణరావు శనివారం తెలిపారు. నంద్యాల జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో కెల్లా అత్యధికంగా 11 మంది విద్యార్థులు ఎంపికై జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం హర్షించదగిన విషయమని తెలిపారు. 2022- 2023 విద్యా సంవత్సరానికి గాను ఫిబ్రవరి- 2023 లో జాతీయ స్థాయిలో జరిగిన నేషనల్ మీన్స్- కం – మెరిట్ స్కాలర్షిప్(ఎన్ ఎమ్ ఎమ్ ఎస్) పరీక్షలో
ఎంపికైన విద్యార్థులు రానున్న నాలుగు విద్యా సంవత్సరాలకు ప్రతి సంవత్సరం 12000/- రూపాయల చొప్పున మొత్తంగా 48000/- రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి ఉపకార వేతనంను అందుకోనున్నారని తెలిపారు.స్కాలర్షిప్ కు ఎంపికైన 8వ తరగతి విద్యార్థులు పి ప్రవల్లిక, పి కమలాకర్, జి చైతన్య శ్రీ, యం. బాల ప్రశాంత్, ఎస్. శ్రీలేఖ ,ఎన్. కార్తీక్ ,పి. ఉమామహేశ్వరి, వి. రామ్ చరణ్, యస్ దావూద్ ఇబ్రహీం, కే రాజేశ్వరి, టి. వెంకట వర్షితలను ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ విజయానికి పూర్తి నిబద్ధతతో కృషి చేసిన ఉపాధ్యాయ బృందం పీర్ భాష ,నజిమున్నీసా బేగం, సలీం అహ్మద్, షర్మిల మరియు రమేష్ బాబులను ప్రిన్సిపాల్ మరియు తల్లిదండ్రులు కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాల కొరకు ఉపాధ్యాయ బృందం కృషి చేయాలని ఆకాంక్షించారు.