జాతీయ పంచాయతీ అవార్డులు జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ పురస్కారం పంపిణీ కార్యక్రమం అవార్డులు ప్రధానం చేసిన విద్యాశాఖ మంత్రి సబితఇంద్ర రెడ్డి

*వికారాబాద్ జిల్లా*

*వికారాబాద్ డిపిఆర్సి భవన్ లో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డులు 2023,జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.*

*ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ….ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.*

*ఉత్తమ గ్రామలుగా ఎంపికైన 27 గ్రామ పంచాయతీలకు అభివృద్ధి పనులకు 10 లక్షల చొప్పున నిధులను మంత్రి మంజూరు చేసారు.*

*పల్లె ప్రగతితో పల్లెల్లో ప్రకృతి వనాలు, నర్సరీలు,మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు,24 గంటల విద్యుత్,వైకుంఠ దామలు,హరితహారం తదితర సౌకర్యాల కల్పనతో ప్రజలు పట్టణాల నుండి పల్లెలకు వలసలు వస్తున్నారు.*

*దేశ వ్యాప్తంగా టాప్ 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణ నుండే ఎంపిక అవ్వటం యావత్ తెలంగాణ సర్పంచ్ల విజయం అని మంత్రి పేర్కొన్నారు.*

*గతంలో గ్రామాలకు వెళ్తే చెత్త స్వాగతం పలికేదని ఒక ప్రత్యేక విజన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన పల్లె ప్రగతితో చెత్త రహిత గ్రామాలుగా,స్వచ్ఛ గ్రామాలుగా మారిపోయాయన్నారు.*

*అందరూ సర్పంచ్లు బాగా పనిచేస్తున్నారని అభినందనలు తెల్పిన మంత్రి, అవార్డులు సాధించిన గ్రామాలను మిగతా సర్పంచ్లు ఆదర్శంగా తీసుకోవాలని,భవిష్యత్తులో రాష్ట్ర,దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపునిచ్చారు.*

*ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు,ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ గారు,కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు,కాలే యాదయ్య గారు,కలెక్టర్ నారాయణ్ రెడ్డి గారు,అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ గారు, జడ్పీ సిఈఓ జానకి రెడ్డి గారు,డిప్యూటీ సిఈఓ సుభాషిణి గారు,డీసీసీబీ,డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు మనోహర్ రెడ్డి గారు,కృష్ణారెడ్డి గారు,సుశీల్ కుమార్ గౌడ్ గారు,డిపిఓ,ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్లు పాల్గొన్నారు.*

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!