స్టూడియో 10 టీవీ న్యూస్ , మార్చి 24
కంభం మండలంలోని కందులాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనాలను శుక్రవారం సర్పంచ్ బి. రజిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను, పరిశీలించారు. రోజువారి మెనూలో భాగంగా శుక్రవారం అన్నము ఆకుకూర పప్పు, చిక్కీ మరియు గ్రుడ్డు వడ్డించగా విద్యార్థులతో సహా పంక్తి భోజనాలను చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జి. శ్రీనివాసరావు, సిఆర్పీ రవీంద్ర నాయక్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.