గద్వాల:కేసీఆర్ అహంకారాన్ని అణ చివేసి ఫాంహౌజ్ నుంచి పొలం దాకా తీసుకొచ్చిన ఘనత బీజేపీదేనని అని బీజేపీ జిల్లా కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు అర్.కె.కుశ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రాన్ని తిట్టడం తప్ప రైతులకు సీఎం కేసీఆర్ చేసిందేమిటని ప్రశ్నించారు.8 ఏండ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఎందుకు సాయం చేయలేదన్నారు. గతంలో ఏనాడైనా పంట నష్టపోయిన రైతులను పల కరించినవా? అని నిలదీశారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని వర్తింపజేయకుండా ‘రైతుల నోట్లో మట్టి కొట్టిన ‘నువ్వా కేంద్రం గురించి మాట్లాడేది?” అనిలదీశారు. ఏక రానికి రూ. 10 వేల సాయం ఏ మూలకు సరి పోతాయి? అని అడిగారు. తక్షణమే సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా రు. 8 ఏళ్లుగా అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను ఏనాడూ పట్టించుకోని ముఖ్యమంత్రి ఎన్నికల ఏడాది వచ్చేసరికి పంటపొలాలను సందర్శించి రైతులపట్ల ఎనలేని ప్రేమను ఒలకపోస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, అనేక పత్రికలు, టీవీలతోపాటు రైతు సంఘాల నేతలు సైతం ఇదే విషయం చెబుతున్నాయని చెప్పారు. సీఎం మాత్రం 2 లక్షల 28 వేల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని చెప్పడం విడ్డూరం గా ఉందన్నారు. ఇకనైనా కేసీఆర్ కేంద్రాన్ని విమర్శించడం మానుకుని రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా ఆరుకోవాలన్నారు.